భూదాన్ పోచంపల్లి, జూలై 30 : భూదాన్ పోచంపల్లి నూతన ఎస్ఐగా జడ జగన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సంస్థాన్ నారాయణపురం నుండి భూదాన్ పోచంపల్లికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి భువనగిరి హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు సహకరించాల్సిందిగా నూతన్ ఎస్ఐ కోరారు.