Union Budget | చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల బైబ్యాక్ విధానాలకు శరాఘాతం పలికింది. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రతను తగ్గించినట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను వివాదాల్లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు. జరిమానా చెల్లిస్తే రెండేళ్ల జైలు శిక్ష కూడా మినహాయిస్తామని చెప్పారు. అలాగే భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. 2047 వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీ డే ప్రకటించారు. ట్యాక్స్ హాలీ డే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు.