IndianOil | గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఆయిల్.. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్ డెలివరీ
IndianOil | ఎల్పీజీ (LPG) వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ (Indane XTRALITE NOW)’ పేరుతో తేలికైన 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను ప్రవేశపెట్టడంతోపాటు బుక్ చేసిన నాలుగు గంటల్లోనే ఇంటికే డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
IndianOil : ఎల్పీజీ (LPG) వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ (Indane XTRALITE NOW)’ పేరుతో తేలికైన 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ను ప్రవేశపెట్టడంతోపాటు బుక్ చేసిన నాలుగు గంటల్లోనే ఇంటికే డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
సంప్రదాయ ఉక్కు సిలిండర్లతో పోలిస్తే కొత్త 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ బరువు తక్కువగా ఉంటుంది. దాంతో దాన్ని మోయడం, తరలించడం, వినియోగించడం మరింత సులభమవుతుందని ఇండియన్ ఆయిల్ తెలిపింది. గృహ వినియోగంతోపాటు చిన్న వ్యాపార అవసరాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నది. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్‌ను ఇంటికే అందించేలా కొత్త సేవను రూపొందించింది.
ఈ సేవలో వినియోగదారులకు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. తమకు అనుకూలమైన డెలివరీ సమయాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. డిజిటల్ విధానంలో సులభంగా బుక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దాంతో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మారుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూరు నగరాల్లో ఈ కొత్త సేవ అందుబాటులో ఉంది.
వినియోగదారుల స్పందనను బట్టి త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఇండియన్ ఆయిల్ వెల్లడించింది. అలాగే 5 కిలోల ఇండేన్ చోటూ సిలిండర్‌కు కూడా నాలుగు గంటల్లో డెలివరీ సేవను విస్తరించింది. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఎక్కువగా వినియోగించే ఈ సిలిండర్‌ను కూడా త్వరగా అందించేలా చర్యలు తీసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

