RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తేలిపోయిందన్నారు.
RS Praveen Kumar | వరుస వివాదాల నేపథ్యంలో హైకోర్టు (High Court) హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను(Ranganath) తొలగించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రంగనాథ్ మీదున్న 63 కోర్టు ధిక్కరణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయ స్థానం ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని, రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదన్నారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తేలిపోయింది. లక్షమంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో హోంమంత్రి అయిన గౌరవ హైకోర్టు స్థానిక పోలీసులెవరూ కూడా తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడలేరు. అందుకు ఆర్మీ అధికారులను ఆదేశించింది.. అంటే అసలు మీకు ఇక నైతిక హక్కు ఎక్కుడుందని ప్రశ్నించారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం. విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో, వెలుగుమట్లలో నాశనం చేశారు. సున్నం చెరువు పేరుతో, బహదూర్ గూడ పేరుతో, లోతుకుంటలో ఎక్కడ చూసినా విధ్వంసమే. ఆ విధ్వంసం చేస్తూనే మరోవైపు పేదల భూములను మీ సొంత సోదరులు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కబ్జాలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
హైడ్రాను అడ్డం పెట్టుకుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి పోర్టల్‌ను తీసుకొని దొడ్డి దారిన దాదాపు 22 వేల ఎకరాల భూముల హక్కులను రాత్రికి రాత్రే ఎమ్మార్వో, ఆర్డీవోల సంతకాలు లేకుండా బదలాయించారు. అందుకే నేను గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన మీ అధికారిగా, సోదరుడిగా, ప్రభుత్వ అధికారులకు చెబుతున్నా దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి. చట్టాన్ని పాటించండి.. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను దయచేసి అతిక్రమించకండని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.
హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ
రేవంత్ రెడ్డికి తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదు
స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదని, ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు చెప్పడం అంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే
హైడ్రాను అడ్డం పెట్టుకుని రాష్ట్రమంతా విధ్వంసం సృష్టించి,… https://t.co/mHUtpurJDO pic.twitter.com/vSr9wXf3h1
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
Read Also :
Belawadi Mallamma | రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’లో భూమి పెడ్నేకర్.. యోధురాలి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!
Nitin Gadkari | ‘ఈ20 పెట్రోల్’ తో లబ్ధి ఆరోపణలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
మత్తు కోసం దొంగతనాలు.. బెంబేలెత్తుతున్న జనం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

