Iran vs USA | అమెరికా నుంచి నఖ్వీ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు : ఇరాన్
Iran vs USA | అమెరికా (USA) నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్ (Iran) విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్ (Pakistan) ఇంటీరియర్ మంత్రి మోహసీన్ నఖ్వీ (Mehasin Naqui) ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) చేరుకొన్న వేళ ఈ వివరణ రావడం గమనార్హం. నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల నిమిత్తమే వచ్చినట్లు వెల్లడించింది.
Iran vs USA : అమెరికా (USA) నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్ (Iran) విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్ (Pakistan) ఇంటీరియర్ మంత్రి మోహసీన్ నఖ్వీ (Mehasin Naqui) ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) చేరుకొన్న వేళ ఈ వివరణ రావడం గమనార్హం. నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల నిమిత్తమే వచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్ నుంచి అమెరికాకు మొత్తం ఏడు షరతులు వెళ్లాయి.
ఇందుకోసం ఖతార్ మధ్యవర్తులను వాడుకుంది. డిమాండ్లను తిరస్కరిస్తే తాము నిర్ణయాత్మక యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు దీనిలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం నేషనల్ కౌన్సిల్ చీఫ్ మోహసీన్ రెజాయి స్పందిస్తూ ఖతార్ ఇప్పటికే అమెరికాకు వీటిని చేరవేసిందని, అధ్యక్షుడు ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. యుద్ధాన్ని ముగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటివి ఈ డిమాండ్‌ల్లో ఉన్నాయి.
మరోవైపు క్యాంప్ డేవిడ్‌లో తన వారాంతపు విడిదిని కుదించుకొని ట్రంప్ శ్వేతసౌధానికి హడావుడిగా తిరిగి వచ్చారు. శాంతి చర్చల పునః ప్రారంభానికి ఇరాన్ ఏడు నిబంధనలు విధించిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఇక యెమెన్‌లో హూతీ రెబల్స్ కూడా సౌదీ రాజధాని రియాద్‌పై దాడి చేయడంతో అమెరికా కూడా పరిమిత స్థాయి సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వార్తొలొస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

