Nitin Gadkari | ‘ఈ20 పెట్రోల్’ తో లబ్ధి ఆరోపణలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari | తన పేరును ఈ20 పెట్రోల్ (E20 Ethenol) కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియా (Social Media) లో ప్రచారమైన పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkari) న్యాయపోరాటానికి దిగారు. తనతోపాటు కుటుంబసభ్యులు ఈ20 విధానంవల్ల లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించారు.
Nitin Gadkari : తన పేరును ఈ20 పెట్రోల్ (E20 Ethenol) కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియా (Social Media) లో ప్రచారమైన పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkari) న్యాయపోరాటానికి దిగారు. తనతోపాటు కుటుంబసభ్యులు ఈ20 విధానంవల్ల లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై మెటాతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ దావా వేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ20 ఇథనాల్ కార్యక్రమంవల్ల తన కుటుంబం లాభపడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని వివరించారు.
ఈ పోస్టులు డీప్‌ఫేక్ కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో బాంబే హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని గడ్కరీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జస్టిస్ అభయ్ అహుజా.. సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేశారు. ఈ పరిణామానికి రెండు వారాలముందు నాగ్‌పూర్‌లోనూ ఇదే అంశంపై కేసు నమోదైంది. ఈ20 కార్యక్రమానికి సంబంధించి కేంద్రమంత్రిపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వారిలో యూట్యూబర్, రాజకీయ నాయకుడు మనీష్ కశ్యప్‌తోపాటు ‘దేశీ బాయ్స్’ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా.. హర్షిత్ రాఠీ పేర్లు ఉన్నాయి. ఈ20 ఇంధన విధానంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ ఇంధనం అనుకూల వాహనాలకు సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే పాత వాహనాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

