Commonwealth Games | కామన్వెల్త్లో తేలిపోయిన భారత చిరుత.. 100 మీటర్ల పరుగులో సెమీస్ చేరలే..!
Commonwealth Games: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games 2026) పతకంపై ఆశలు రేపిన గురిందెర్విర్ సింగ్ (Gurindervir Singh) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.
Commonwealth Games: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games 2026) పతకంపై ఆశలు రేపిన గురిందెర్విర్ సింగ్ (Gurindervir Singh) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సోమవారం నిర్వహించిన పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆరంభంలో దూకుడు కనబరిచినా చివరకు 10.39 సెకన్లలో పరుగు పూర్తి చేసి 28వ స్థానంలో నిలిచాడు. దాంతో, భారత చిరుతగా పేరొందిన అతడు కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయాడు.
ఇటేవలే 100 మీటర్ల పరుగులో భారత వేగవంతమైన అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన గురిందెర్విర్ సింగ్ కామన్వెల్త్ క్రీడల్లో కచ్చితంగా పతకం గెలుస్తాడని అందరూ ఊహించరు. కానీ, మనోడు మాత్రం ఉసూరుమనిపించాడు.
Indian Fastest Man Gurindervir Singh was not able to Qualify for SF of 100m
– Clocked disappointing 10.39s in Men’s 100m & finished 28th place Overall 😢 pic.twitter.com/Is380unErA
— The Khel India (@TheKhelIndia) July 27, 2026
కామన్వెల్త్కు ముందు 10.10 సెకన్లతో రికార్డు సృష్టించిన గురిందెర్విర్.. గ్లాస్గోలో అంచనాలు అందుకోలేకపోయాడు. సోమవారం 73 మంది పోటీపడిన 100 మీటర్ల పరుగులో సెమీఫైనల్‌కు చేరాలంటే 10.24 సెకన్లు పూర్తి చేయాలి. కానీ, గురిందెర్విర్ మాత్రం 10.39 సెకన్లు తీసుకున్నాడు. 11 హీట్స్‌లో తేలిపోయిన భారత స్టార్ అథ్లెట్ మరీ దారుణంగా 28వ స్థానంలో నిలిచాడు. తొలి 17 స్థానాల్లోని వారు మాత్రమే ముందంజ వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

