న్యూఢిల్లీ: మహిళల నేతృత్వంలో రిటైల్ ఔట్లెట్లను ప్రోత్సహించడానికి బడ్జెట్లో చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళా వ్యవస్థాపకులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక మద్దతు కోసం ‘షీ మార్ట్’లను బడ్జెట్లో ప్రతిపాదించారు. (Union Budget 2026) ‘లాక్పతి దీదీ కార్యక్రమం విజయం ఆధారంగా సెల్ప్ హెల్ప్ ఎంట్రప్రెన్యూర్ (షీ) రిటైల్ ఔట్లెట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేస్తాం. క్రెడిట్ లింక్డ్ జీవనోపాధి నుంచి స్వయం సహాయక సంస్థల యజమానులుగా మహిళలు మారడానికి ఇది సహాయపడుతుంది’ అని అన్నారు.
‘షీ మార్ట్’ అంటే ఏమిటి?
మహిళా సమాఖ్యలు, కమ్యూనిటీల యాజమాన్యంలో ఏర్పాటు చేసే రిటైల్ అవుట్లెట్లను స్వయం సహాయక వ్యవస్థాపక మార్టులు (షీ మార్ట్) అని అంటారు. గ్రామీణ మహిళలు నిర్వహించే వ్యాపార సంస్థలకు బలమైన మార్కెట్ సృష్టించడం, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడం దీని లక్ష్యం. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడం, మహిళా యజమానులు వ్యాపార రంగంలో రాణించడం, మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించడానికి ఈ పథకం దోహదపడుతుంది.
Also Read:
Union Budget 2026: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి
Union Budget 2026: కొత్తగా మూడు అఖిల భారత ఆయుర్వేద సంస్థలు.. ఆయుష్ ఫార్మసీలు అప్గ్రేడ్
Union Budget 2026 | దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత.. రూ.7.85 లక్షల కోట్ల బడ్జెట్