న్యూఢిల్లీ: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దివ్యాంగుల సహాయక పరికరాల ఉత్పత్తిని పెంచడానికి కృత్రిమ అవయవ తయారీని ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. (Union Budget 2026) దివ్యాంగ్ సహారా పథకం కింద సహాయక పరికరాల ఉత్పత్తిని పెంచడంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో)కు మద్దతు ఇస్తామని చెప్పారు.
కాగా, ఏఐ ఇంటిగ్రేషన్, పరిశోధన, అభివృద్ధిలో కూడా పెట్టుబడులు పెడతామని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి దివ్యశ కేంద్రాలను బలోపేతం చేయడానికి, వికలాంగులకు సహాయక పరికరాలను సులభంగా యాక్సెస్ చేసే ఆధునిక రిటైల్-శైలి కేంద్రాలైన సహాయక టెక్నాలజీ మార్ట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ఈ చొరవ దోహదపడుతుందని వివరించారు.
మరోవైపు మానసిక ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర మంత్రి సీతారామన్ పునరుద్ఘాటించారు. నిమ్హాన్స్-2ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘ఉత్తర భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ సంస్థలు లేవు. అందువల్ల నిమ్హాన్స్-2ను ఏర్పాటు చేస్తాం. జార్ఖండ్‌లోని రాంచీ, అస్సాంలోని తేజ్‌పూర్‌లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను కూడా ప్రాంతీయ అగ్రశ్రేణి సంస్థలుగా అప్‌గ్రేడ్ చేస్తాం’ అని అన్నారు.
Also Read:
Union Budget 2026: కొత్తగా మూడు అఖిల భారత ఆయుర్వేద సంస్థలు.. ఆయుష్ ఫార్మసీలు అప్‌గ్రేడ్
Union Budget 2026 | దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత.. రూ.7.85 లక్షల కోట్ల బడ్జెట్
Union Budget | ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి వెల్లడి