Alias Rukmini | హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతూనే, అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా నాని సమర్పణలో హీరో నితిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ ’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.ఈ చిత్రానికి యువ దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. కథలో కొత్తదనం, ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నట్లు టైటిల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ వీడియోకు నాని అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్లింప్స్ ప్రారంభంలో నితిన్ ఇంజినీరింగ్ పుస్తకాల మధ్య నిద్రపోతూ కనిపిస్తాడు. అయితే అతని ముందు కనిపించే పుస్తకాల పేర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘గరం గోపాల్’, ‘ఆమెకు ఆమెంటే ఇష్టం’, ‘వత్రం వెంకన్న’ వంటి వినూత్న శీర్షికలతో ఉన్న పుస్తకాలను చూపిస్తూ వాటి రచయితగా ‘రుక్మిణి’ అనే పేరును ప్రస్తావిస్తారు. దీంతో ఈ రుక్మిణి ఎవరు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది.ఆ సమయంలో నాని వాయిస్ ఓవర్లో రుక్మిణి గురించి వివరిస్తుండగా, చివర్లో నితిన్ “ఆమె నా భార్య” అని చెప్పడం గ్లింప్స్‌కు ఆసక్తికర ముగింపునిచ్చింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమా కథపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రుక్మిణీ పాత్ర కథలో ఎంత కీలకమనే అంశాలపై చర్చ మొదలైంది.
నితిన్ కెరీర్లో ఇది మరో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో మేకర్స్ చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.నాని సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో నాని నిర్మాణంలో వచ్చిన పలు చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ కూడా పొందాయి. దీంతో ‘అలియాస్ రుక్మిణి’ కూడా కంటెంట్ ఆధారిత చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించనుంది. టైటిల్ గ్లింప్స్‌తోనే ఆసక్తిని పెంచిన ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.