CPR | ఉరి వేసుకున్న వ్యక్తిని సీపీఆర్ చేసి ఓ కానిస్టేబుల్ కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..నల్గొండ జిల్లా చండూర్ మండలం ఉడుతలపల్లి గ్రామంలో సైదులు అనే వ్యక్తి భార్యతో గొడవ పడి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే100కు కాల్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి సైదులుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ సమయస్ఫూర్తిని గ్రామస్తులు అభినందించారు. ఈ విడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉరి వేసుకున్న వ్యక్తిని సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్
నల్గొండ జిల్లా చండూర్ మండలం ఉడుతలపల్లి గ్రామంలో భార్యతో గొడవ పడి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సైదులు అనే వ్యక్తి
స్థానికులు 100కు కాల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకొని మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి సైదులుకు సీపీఆర్ చేసి… pic.twitter.com/roDPblJSD6
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026