లక్నో: ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. (UP govt withholds salaries) జనవరి 31 గడువులోగా మానవ సంపద పోర్టల్లో చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమైన ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలు నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పనిసరిగా ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసే వరకు జీతాల నిలిపివేత కొనసాగుతుందని చెప్పారు. ఈ నిబంధనలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హెచ్చరించింది.
కాగా, ప్రభుత్వ డేటా ప్రకారం 34,926 గ్రూప్ సీ ఉద్యోగులు, 22,624 గ్రూప్ డీ సిబ్బంది, 7,204 గ్రూప్ బీ అధికారులు, 2,628 గ్రూప్ ఏ అధికారులు నిర్దేశిత సమయంలోగా తమ ఆస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు.
మరోవైపు ప్రధాన కార్యదర్శి ఎస్పీ గోయల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు గడువులోగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉద్యోగులకు ఫిబ్రవరిలో కూడా జీతాలు అందుతాయన్న గ్యారెంటీ లేదన్నారు.
Also Read:
Union Budget 2026 | మహిళల నేతృత్వంలో రిటైల్ ఔట్లెట్లు.. ‘షీ మార్ట్’లకు బడ్జెట్లో ప్రోత్సాహం
Union Budget 2026: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి
Union Budget 2026: కొత్తగా మూడు అఖిల భారత ఆయుర్వేద సంస్థలు.. ఆయుష్ ఫార్మసీలు అప్గ్రేడ్
Union Budget 2026 | దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత.. రూ.7.85 లక్షల కోట్ల బడ్జెట్