లక్నో: చిరుతిండి మోమోల పట్ల ఒక బాలుడికి ఉన్న ఇష్టాన్ని గ్రహించిన వ్యాపారులు అతడ్ని ట్రాప్ చేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు తెచ్చి ఇస్తే మోమోలు ఉచితంగా ఇస్తామని ప్రలోభపెట్టారు. ముగ్గురు మోమో విక్రేతలు ఆ బాలుడి నుంచి రూ.85 లక్షల విలువైన నగలు కాజేశారు. (Momos For Jewellery) ఈ విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబం షాక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఈ సంఘటన జరిగింది. విమ్లేష్ మిశ్రా వారణాసిలో ఒక ఆలయ పూజారి. ఆయన కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు.
కాగా, ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మోమోలు అమ్మే వ్యాపారులు ఆ బాలుడ్ని మెల్లగా ట్రాప్ చేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు తెచ్చి ఇస్తే ఉచితంగా మోమోలు ఇస్తామని ఆశపెట్టారు. దీంతో ఆ బాలుడు కొంత కాలంగా ఇంట్లోని నగలు తెచ్చి వారికి ఇవ్వసాగాడు. ఉచితంగా మోమోలు తింటున్నాడు.
మరోవైపు విమ్లేష్ మిశ్రా సోదరి ఇటీవల వారి ఇంటికి వచ్చింది. తన నగలు ఇవ్వాలని ఆమె అడిగింది. దీంతో ఆ కుటుంబం బీరువా తెరిచి చూడగా రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆ బాలుడ్ని ప్రశ్నించగా మోమో వ్యాపారులకు నగలు ఇచ్చి వాటిని తిన్నట్లు చెప్పాడు. ఇది తెలుసుకుని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ముగ్గురు మోమో వ్యాపారులపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Ram’s arrow hits Ravan’s eye | రామ్లీలా నాటకంలో.. రావణుడి కంటికి తగిలిన రాముడి బాణం, కేసు నమోదు
Car In Handcuffs | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. కారుకు బేడీలు వేసిన పోలీసులు
wife kills husband | తొమ్మిదేళ్లుగా ప్రేమించింది.. పెళ్లైన రెండు నెలలకే భర్తను చంపింది