మీ ఇంట్లో నిశ్శబ్దం ఉందా?
అందంగా కనిపించే ఇల్లు అందరికీ నచ్చుతుంది. కానీ, ప్రశాంతంగా అనిపించే ఇల్లు మాత్రం మనసులో నిలిచిపోతుంది. అందుకే ప్రపంచ ఇంటీరియర్ డిజైన్లో ఇప్పుడు ‘అకౌస్టిక్ ఇంటీరియర్స్' అనే కొత్త ధోరణి వేగంగా ప్రాచుర్యం పొందుతున్నది.
అందంగా కనిపించే ఇల్లు అందరికీ నచ్చుతుంది. కానీ, ప్రశాంతంగా అనిపించే ఇల్లు మాత్రం మనసులో నిలిచిపోతుంది. అందుకే ప్రపంచ ఇంటీరియర్ డిజైన్లో ఇప్పుడు ‘అకౌస్టిక్ ఇంటీరియర్స్’ అనే కొత్త ధోరణి వేగంగా ప్రాచుర్యం పొందుతున్నది. అంటే… ఇంట్లో శబ్దం, ప్రతిధ్వని, బయటి హోరును వీలైనంత తగ్గించి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేలా ఇంటిని రూపకల్పన చేయడం. ఇది కేవలం అందానికి సంబంధించిన అంశం కాదు. జీవన నాణ్యతకు సంబంధించిన మార్పు.
నగరాల్లో ట్రాఫిక్ హోరు, అపార్టుమెంట్లో పకింటి శబ్దాలు, ఇంట్లో టెలివిజన్, వంటగదిలో సందడి… ఇలా రోజంతా శబ్దాల మధ్యే గడిచిపోతున్నది. ఈ నేపథ్యంలో గది ఎలా కనిపిస్తుందన్న దానితోపాటు, అకడ ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామన్నదీ ఇప్పుడు ఇంటీరియర్ రూపకల్పనలో భాగమవుతున్నది. అలాగని అకౌస్టిక్ ఇంటీరియర్స్ అంటే ఖరీదైన మార్పులు చేయడమనే కాదు. గదిలో ప్రతిధ్వనిని తగ్గించేలా మందపాటి తెరలు, పెద్ద పరుపులు, వస్త్రంతో చేసిన సోఫాలు, కుషన్లు, పుస్తకాల అల్మరాలు, చెక అలంకరణల్లాంటివి ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. ఆధునిక గృహాల ఇంటీరియర్లో గోడలకు శబ్దాన్ని శోషించే ప్రత్యేక పలకలు, వస్త్రంతో చేసిన గోడ అలంకరణలు అమర్చే ధోరణి కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా చిన్న అపార్టుమెంట్లలో ఈ ఆలోచన మరింత ఉపయోగకరంగా మారుతున్నది.
ఒకే గదిలో ఆఫీస్ మీటింగ్, పిల్లల ఆన్లైన్ క్లాస్, కుటుంబ సభ్యుల విశ్రాంతి… అన్నీ జరుగుతున్నప్పుడు శబ్దాన్ని నియంత్రించడం అన్నది సౌకర్యాన్నిపెంచుతుంది. ఇంటీరియర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో అందంగా కనిపించే ఇంటి కంటే.. ప్రశాంతంగా అనిపించే ఇంటికే ఎకువ విలువ ఉండబోతున్నది. అంటే ఇక ముందు ఇంటి విలాసాన్ని కళ్లతో మాత్రమే కాదు, చెవులతోనూ అనుభవించాలి మరి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

