తిరువనంతపురం: ఒక చిన్నారి ఉన్నట్టుండి రోడ్డు వైపు పరుగెత్తింది. ఒక బస్సు వేగంగా దూసుకొచ్చింది. చిన్నారిని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ బాలికకు ముప్పు తప్పింది. (Girl Miraculous Escape) ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొడియత్తూరు ప్రాంతానికి చెందిన చిన్న పాప ఆకస్మాత్తుగా ఆటో పక్క నుంచి రోడ్డు మీదకు పరుగెత్తింది.
కాగా, ఒక బస్సు వేగంగా దూసుకొచ్చింది. చిన్నారిని గమనించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సు దిశ మార్చడంతో పాటు వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో బస్సు కింద పడే ప్రమాదం నుంచి ఆ చిన్నారి తృటితో తప్పించుకున్నది. వెంటనే వెనుకకు పరుగెత్తింది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు స్పందించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రమాదం నుంచి చిన్నారి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ను ప్రశంసించారు. అయితే ఆ చిన్నారి భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ బాలిక తల్లిదండ్రులపై మండిపడ్డారు.
വാഹനാപകടത്തില് നിന്ന് പെൺകുട്ടി രക്ഷപ്പെട്ടത് തലനാരിഴയ്ക്ക്, സംഭവം കൊടിയത്തൂരിൽ#accident #viralvideo #kozhikode pic.twitter.com/VyE6oKqHaP
— DD News Malayalam (@DDNewsMalayalam) February 2, 2026
Also Read:
Arsenic Laced Sweets | షాపు వద్ద విషం కలిపిన స్వీట్ బాక్స్.. స్వీట్లు తిని ముగ్గురు మృతి
Bird flu in Bihar | 150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ, హెచ్చరిక జారీ
Watch: గుర్రంపై ఊరేగిన దళిత వరుడు.. కత్తులతో దాడికి అగ్రవర్ణాలు యత్నం