అహ్మదాబాద్: దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తులు దీనిని సహించలేకపోయారు. కత్తులతో దాడికి ప్రయత్నించారు. పెళ్లి బృందంలోని కొందరు వ్యక్తులను కొట్టారు. (Dalit Groom Attacked With Swords ) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాంద్రుమాన గ్రామంలో దళిత వర్గానికి చెందిన విశాల్ చావడా పెళ్లి ఆదివారం జరిగింది. వరుడిగా ముస్తాబైన అతడు గుర్రంపై ఊరేగుతూ పెళ్లి బృందంతో కలిసి వేదిక వద్దకు బయలుదేరాడు.
కాగా, ఆ గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ వ్యక్తులు దీనిని సహించలేకపోయారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని అడ్డుకున్నారు. ‘ఈ గ్రామంలో ఒక దళితుడు గుర్రంపై స్వారీ చేయడానికి ఎంత ధైర్యం?’ అంటూ ఊగిపోయారు. ఒక వ్యక్తి పొడవైన కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా కొందరు మహిళలు అడ్డుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన మరికొందరు పెళ్లి గుంపులోని మగవారిని కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంఘటనతో భయాందోళన చెందిన దళిత వరుడి కుటుంబానికి రక్షణ కల్పించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్రంపై ఊరేగిన దళిత వరుడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
गुजरात के पाटन में दलित व्यक्ति को घोड़ी पर बैठता देखकर
जातिवादी मनुवादी खुली तलवार लेकर मारने गया
भीड़ ने जैसे तैसे रोका…! pic.twitter.com/Xdb1uN4Ch0— Nikhil chavda (@Nikhilchavdagj1) February 1, 2026
Also Read:
Bird flu in Bihar | 150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ, హెచ్చరిక జారీ
Momos For Jewellery | రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చి.. మోమోలు తిన్న బాలుడు
Watch: రోడ్డుపై ఘర్షణ.. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్