పాట్నా: ఒక ప్రాంతంలో సుమారు 150కుపైగా కాకులు మరణించాయి. నామూనాలు సేకరించి ల్యాబ్స్‌కు పంపారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఆ కాకుల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. (Bird flu in Bihar) స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 11న నౌగాచియా సబ్‌డివిజన్‌లో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వారు వందలాది కాకులు మరణించడాన్ని గమనించారు. ఇతర పక్షులు కూడా అలాంటి స్థితిలో ఉండటం చూశారు. ఆందోళన చెందిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాగా, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన పక్షులను సురక్షితంగా తొలగించారు. అటవీ, పశుసంవర్ధక శాఖల సంయుక్త బృందం కలిసి సీరం నమూనాలు సేకరించారు. పరీక్ష కోసం పాట్నా, భోపాల్‌లోని ఉన్నత స్థాయి ప్రయోగశాలలకు పంపారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఆ కాకులు మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.
మరోవైపు భాగల్పూర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత జోన్ పరిధిలోని 10 కిలోమీటర్ల వరకు శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టింది. చుట్టుపక్కల ప్రాంతంలోని కోళ్ల ఫారాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. బర్డ్ ఫ్లూపై నిఘా, పర్యవేక్షణను ముమ్మరం చేశారు.
అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. అనారోగ్యం చెందిన లేదా మరణించిన పక్షులను తాకవద్దని సూచించారు. పక్షుల మరణాలు గుర్తించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
Also Read:
Momos For Jewellery | రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చి.. మోమోలు తిన్న బాలుడు
Ram’s arrow hits Ravan’s eye | రామ్‌లీలా నాటకంలో.. రావణుడి కంటికి తగిలిన రాముడి బాణం, కేసు నమోదు
wife kills husband | తొమ్మిదేళ్లుగా ప్రేమించింది.. పెళ్లైన రెండు నెలలకే భర్తను చంపింది
Watch: రోడ్డుపై ఘర్షణ.. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్