భువనేశ్వర్: చెవిటి, మూగ, అంధత్వంతో బాధపడుతున్న దివ్యాంగ పిల్లలను ఆ స్కూల్లోని వార్డెన్ లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించారు. దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు చేశారు. (Divyangjan Students Abused By Warden) ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ దారుణం జరిగింది. పరమానందపూర్లో చెవిటి, మూగ, అంధ విద్యార్థుల కోసం రెడ్ క్రాస్ స్కూల్ ఉన్నది. అక్కడి మగ వార్డెన్ సంధ్యా దర్శన్ మహాపాత్ర బాలికలు, బాలురను భౌతికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. దివ్యాంగ బాలికలను అనుచితంగా తాకుతున్నాడు.
కాగా, ఆ వార్డెన్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కలహండి జిల్లా బాలల రక్షణ అధికారికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు కోసం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు.
Also Read:
Bird flu in Bihar | 150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ, హెచ్చరిక జారీ
Momos For Jewellery | రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చి.. మోమోలు తిన్న బాలుడు
Watch: రోడ్డుపై ఘర్షణ.. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్