ప్రజాధనం అంటే అంత తేలికైపోయింది. ప్రాజెక్టు రూపకల్పనలోనే పకా ప్రణాళిక ఉండదు.. తీరా పనులు మొదలుపెట్టాక అంచనాలు పెంచుకుంటూ పోవడమే పనిగా మారింది. నగరంలోని కీలక ప్రాంతంలో తలపెట్టిన ఓ ఫె్లైఓవర్ నిర్మాణం అక్రమారులకు కామధేనువులా మారింది. ఒకే ఒక ప్రాజెక్టుకు ఏకంగా మూడుసార్లు అంచనాలు మారుస్తూ, వ్యయాన్ని రూ.80 కోట్ల నుంచి రూ.210 కోట్లకు పెంచేయడం గమనార్హం. అధికారులు చెబుతున్న కాకి లెకల వెనుక భారీ స్థాయిలో ప్రజాధనం వృథా అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పీవీ నర్సింరావు మార్గ్ (నెక్లెస్ రోడ్) నుంచి జేమ్స్ స్ట్రీట్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా, ప్యాట్నీ సెంటర్ మార్గాల్లో నిత్యం నరకయాతన చూపిస్తున్న ట్రాఫిక్ చికులను దాటేందుకు గతంలో పాటిగడ్డ ఆర్వోబీ రసూల్‌పురా వద్ద 4-లైన్ల వన్‌వే ఫె్లైఓవర్ను ప్రతిపాదించారు. దానికి రూ.80 కోట్లు మంజూరయ్యాయి. ఐతే హెచ్ఎండీఏ ట్రాఫిక్ అధ్యయనం ప్రకారం ఆ డిజైన్ల స్థానంలో పీవీ నర్సింహారావు మార్గ్ నుంచి పాటిగడ్డ, రసూల్‌పురా-సర్దార్‌పటేల్ రోడ్డును అనుసంధానిస్తూ నాలుగు లేన్ల ద్విముఖ (బై డైరెక్షన్) ఫె్లైఓవర్, ఆర్వోబీ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో అంచనా వ్యయం రూ.80 కోట్ల నుంచి రూ.210 కోట్లకు పెంచేశారు.
అయితే అంచనా వ్యయం ఒకసారిగా రూ.130 కోట్లు పెరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులకు తీవ్ర ఉపశమనం కలిగించే ఈ కీలక ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల్సింది పోయి, అంచనాల పెంపుపైనే అధికారులు ఎకువ దృష్టి సారించారు. మొద ట రూ.80 కోట్లతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టుకు, ఆ తర్వాత సవరణల పేరిట నిధులు పెంచుకుంటూ పోయా రు. రకరకాల కారణాలు చూపి స్తూ చివరికి రూ.210 కోట్లకు ప్రతిపాదనలు చేర్చ డం విశేషం. అంటే దాదాపు మూడు రెట్లు వ్యయాన్ని పెంచేశారు.
సర్వే చేయకుండానే..
అదనపు కల్వర్టులు, స్పాన్ల నిర్మాణం అనివార్యమైందని, డిజైన్లలో మార్పుల వల్లే వ్యయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయకుండానే తొలి అంచనాలు ఎలా తయారు చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారిగా అంచనా వ్యయం రూ.130 కోట్లు ఎలా పెరిగిందనే దానిపై ఇంజనీరింగ్ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ తరహా రీ-ఎస్టిమేషన్లు వేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిధుల పెంపుపై ఉన్నతాధికారులు దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.