అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ రూపొందిస్తున్న ‘రాకా’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దీని తర్వాత తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో బన్నీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట.
గతంలో ‘రేసుగుర్రం’ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ క్యామియో చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ లోకేష్ కనకరాజ్ సినిమాలో బన్నీ పోలీస్ రోల్ పోషిస్తున్నది నిజమైతే..ఆయన్ని పూర్తిస్థాయి కాప్రోల్లో చూడొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాకా’ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే బన్నీ-లోకేష్ కనకరాజ్ సినిమా పట్టాలెక్కనుంది.