హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ధ్వజమెత్తారు.
మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత రెండున్నరేండ్లుగా సుమారు 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వారు జీవితాలు ఆగమయ్యాయన్నారు.