లక్నో: ఒక వ్యక్తి మానసిక ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆహారం ఆలస్యమైందన్న కోపంతో వృద్ధురాలైన తల్లి తలపై గిన్నెతో కొట్టి చంపాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Kills Mother) ఉత్తరప్రదేశ్లోని జేవర్లో ఈ సంఘటన జరిగింది. కిషన్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా ఆగ్రాలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పుడప్పుడు ఆరోగ్యం మెరుగుపడినప్పుడు అతడ్ని ఇంటికి తీసుకువచ్చేవారు. మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు తిరిగి ఆసుపత్రిలో చేర్చేవారు.
కాగా, ఐదు రోజుల కిందట కిషన్ ఇంటికి తిరిగి వచ్చాడు. బుధవారం అతడి తల్లి వంట చేస్తున్నది. అయితే ఆహారం తయారు చేయడంలో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో కిషన్ ఆగ్రహించాడు. వృద్ధురాలైన తల్లి తలపై ఇనుప గిన్నెతో పలుమార్లు కొట్టాడు. ఆ మహిళ అరుపులు విన్న పొరుగువారు ఆ ఇంటికి వచ్చారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు చికిత్స పొందుతూ కిషన్ తల్లి మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి హత్యకు కొన్ని రోజుల ముందు కిషన్ ఇంటి నుంచి పారిపోగా కుటుంబ సభ్యులు వెతికి అతడ్ని తీసుకువచ్చినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: టీచర్ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?