ఇందిరమ్మ చీరలు ఎలుకల పాలు!
ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్‌షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్మూధూళి పేరుకుపోతున్నది. చివరకు ఎలుకల పాలవుతున్నాయి.
- పంపిణీ చేయకుండా మూలకు పడేసిన సిబ్బంది
- కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ జవాబు చెప్పాలి : మన్నె క్రిశాంక్
కంటోన్మెంట్. ఆగస్టు 7 : ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్‌షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్మూధూళి పేరుకుపోతున్నది. చివరకు ఎలుకల పాలవుతున్నాయి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ శుక్రవారం కంటోన్మెంట్ వర్క్‌షాపులో పేరుకుపోయి ఉన్న ఇందిరమ్మ చీరలను పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే శ్రీగణేశ్, ఇతర నాయకులు గత సంవత్సరం నవంబర్లోనే పంచాల్సిన చీరలను మహిళా గ్రూపులకు పంచకుండా కంటోన్మెంట్ వర్క్‌షాప్‌లో నిల్వ ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రకటించారని తొమ్మిది నెలలు పూర్తయినా కంటోన్మెంట్‌లోని మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదని మండిపడ్డారు. వేలాది ఇందిరమ్మ చీరలను వర్క్‌షాపులో మూలకు పడేయడంపై ఎమ్మెల్యే శ్రీగణేశ్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

