కోడేరు, ఆగస్టు 7: కోడేరులోని ఎమ్మా ర్సీ కార్యాలయ భవనంపై కప్పు పెచ్చులు ఊడిపడి కంప్యూటర్ ఆపరేటర్‌కు గాయమైన ఘటన శుక్రవారం చోటు చేసుకున్నది. కాంట్రాక్ట్ బేసిక్‌పై విధులు నిర్వర్తిస్తున్న నాగేంద్రం శుక్రవారం 11గంటల సమయంలో ఎమ్మార్సీ కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో ఎండీఎం పనులు చేస్తున్నాడు. ఉన్నట్టుండి భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో నాగేంద్రం కుడి, ఎడమ చేతులకు గా యాలయ్యాయి. పెచ్చులు ఊడి తలపై పడితే చనిపోయే ప్రమాదం ఉండేదని భయాందోళనకు గురైనట్లు ఆపరేటర్ తెలిపారు.
గతేడాది కూడా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయని ఆసందర్భంలో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమా దం జరుగులేదని ఆవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని శిథిలమైన భవనాన్ని మరమ్మతులు చే యించాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయంపై ఎంఈవో భాస్కర్‌శర్మను సంప్రదించగా ఫోన్ లిప్టు చేయలేదు.