KTR | మస్కట్‌లో చిక్కుకున్న తన తల్లిని ఇండియాకు రప్పించాలని కొడంగల్‌కు చెందిన యువకుడు రేవంత్ సర్కార్‌ను ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో ఆ యువకుడు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి మొరపెట్టుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకపసాల్వాడ్ గ్రామానికి చెందిన తుప్పుడు రాజు అనే యువకుడు మా అమ్మను మస్కట్ నుంచి ఇండియాకు రప్పించాలని కేటీఆర్‌ని కోరాడు.
తన తల్లి 6 నెలలుగా మస్కట్‌లో చిక్కుకుపోయిందని స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని, కేటీఆర్‌ని కలిసి విన్నవించుకున్నాడు. మీ విషయం మాట్లాడాం.. అమ్మ లక్ష్మి ఇండియాకు వచ్చేందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం.. లాయర్ ఏర్పాటుతోపాటు ఇంకేమైనా సాయం కావాలంటే చేస్తామని రాజుకు కేటీఆర్ హామీనిచ్చారు.
సిరిసిల్ల తర్వాత ముందు నీ కొడంగల్‌ని ఉద్ధరించు రేవంత్ రెడ్డి
ఓట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గ జనాల్ని గాలికొదిలేసి, ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాల్లో సభలు పెట్టి తిట్టే పనిలో సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డిని తిడుతూ, తమ సమస్య పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్‌ని కలిసి… pic.twitter.com/p1WnRI9QtM
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్