Blackmailing Over Private Videos | మహిళా అధికారిణి ఇంట్లో రహస్య కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్
Blackmailing Over Private Videos | ప్రభుత్వ మహిళా అధికారిణి నివాసంలో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ప్రైవేట్ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిణి ఫిర్యాదుతో ముగ్గురు నకిలీ జర్నలిస్ట్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ప్రభుత్వ మహిళా అధికారిణి నివాసంలో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ప్రైవేట్ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిణి ఫిర్యాదుతో ముగ్గురు నకిలీ జర్నలిస్ట్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. (Blackmailing Over Private Videos) కర్ణాటకలోని బెలగావిలో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే ముగ్గురు వ్యక్తులు బ్లాక్మెయిల్ దందా నడుపుతున్నారు. ఒక ప్రభుత్వ అధికారిణి నివాసంలోని బెడ్రూమ్ లైట్ హోల్డర్లలో రహస్య కెమెరాలు అమర్చారు. ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారు. జర్నలిస్టుల పేరుతో ఆ మహిళా అధికారిణిని బ్లాక్మెయిల్ చేశారు. ఆ వీడియోలను వార్తా ఛానెళ్లలో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు.
కాగా, మాలమారుతి పోలీస్ స్టేషన్లో బాధిత ప్రభుత్వ అధికారిణి ఫిర్యాదు చేసింది. దీంతో
గోకాక్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులైన 32 ఏళ్ల సమీర్ నిసార్ అహ్మద్ షేక్, 51 ఏళ్ల అబ్దుల్ రషీద్ మకనార్, 43 ఏళ్ల మహమ్మద్ దిలావర్ బాలెకుంద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake journalists Arrest
మరోవైపు మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులు, రహస్య కెమెరా హోల్డర్లు, నేరానికి వినియోగించిన కారును నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరింత మంది బాధితులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Kills Mother | మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. ఆహారం ఆలస్యమైందని తల్లిని హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

