Surat Builder Shoots Self | గన్‌తో కాల్చుకున్న బిల్డర్.. కుమార్తె పెళ్లి రోజు గుండెపోటుతో మృతి
Surat Builder Shoots Self | ప్రముఖ బిల్డర్ గన్‌తో కాల్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తె పెళ్లి జరిగే రోజున గుండెపోటుతో మరణించాడు. ఆ బిల్డర్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అహ్మదాబాద్: ప్రముఖ బిల్డర్ గన్‌తో కాల్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తె పెళ్లి జరిగే రోజున గుండెపోటుతో మరణించాడు. ఆ బిల్డర్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. (Surat Builder Shoots Self) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 58 ఏళ్ల తుషార్ ఘెలనీ ప్రముఖ బిల్డర్. సూరత్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన పేరుగాంచారు. అనేక రెసిడెన్సియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మించారు.
కాగా, తుషార్ ఘెలనీ ఇంట్లో ఆయన కుమార్తె పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి 1న లైసెన్స్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత తుషార్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అవయవాలు దానం చేయాలని కుటుంబం నిర్ణయించింది.
మరోవైపు ఫిబ్రవరి 5న తుషార్ కుమార్తె పెళ్లి. ఆసుపత్రిలో ఉన్న ఆయన అదే రోజు గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో అయవవాల దాన ప్రక్రియ పూర్తి కాలేదు. కేవలం ఆయన కళ్లను మాత్రమే దానం చేయగలిగారు. తుషార్ ఘెలనీ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను విచారిస్తున్నారు.
Also Read:
Man Kills Mother | మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. ఆహారం ఆలస్యమైందని తల్లిని హత్య
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

