Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
Woman Accidentally Hangs | రీల్ పిచ్చి ఒక మహిళ ప్రాణాలు తీసింది. ఉరి వేసుకున్నట్లుగా రీల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు మెడకు తాడు బిగుసుకుపోవడంతో మరణించింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: రీల్ పిచ్చి ఒక మహిళ ప్రాణాలు తీసింది. ఉరి వేసుకున్నట్లుగా రీల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు మెడకు తాడు బిగుసుకుపోవడంతో మరణించింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman Accidentally Hangs) ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల మోహిని రీల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇందులో భాగంగా ఉరి వేసుకున్నట్లుగా రీల్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నించింది. స్టూల్‌పై నిల్చొని ఉరి తాడు మెడలో వేసుకున్నది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారడంతో అదుపుతప్పింది. ఉరి తాడు ఆమె మెడకు బిగుసుకుపోయి మరణించింది.
కాగా, నాలుగేళ్ల కుమార్తె ఆ గదిలోకి వచ్చింది. తల్లి మోహిని ఉరికి వేలాడుతుండటం చూసి భయాందోళన చెందింది. సహాయం కోసం కేకలు వేసింది. దీంతో పొరుగువారు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మోహిని మృతదేహాన్ని కిందకు దించారు. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మొబైల్ ఫోన్ రికార్డ్ ఆధారంగా రీల్ కోసం ప్రయత్నించిన ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్లుగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read:
Man Kills Mother | మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. ఆహారం ఆలస్యమైందని తల్లిని హత్య
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Accidentally
- Filming
- hangs
- Reel
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

