OTT Releases This Week | ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోల సందడి నెలకొననుంది. ఈ వారం ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్తో పాటు ఇతర భాషల్లోనూ కంటెంట్ ప్రేక్షకులను అలరించనుంది. థియేటర్లలో సినిమాలు చూసే అవకాశం లేని వారితో పాటు.. కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం మంచి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత భాగ్య విధాత’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో ఓ ఆస్పత్రిలో నర్సులు అందించిన సేవలను ఆధారంగా చేసుకుని ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌ను రూపొందించారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14 నుంచి ZEE5లో హిందీతో పాటు తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ కానుంది.మరోవైపు త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన విలేజ్ సోషల్ డ్రామా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 14 నుంచి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో మిడ్ వింటర్ బ్రేక్ – ఆగస్టు 10, మారిన్హో – ఆగస్టు 11, రోరీ స్కోవెల్ – ఆగస్టు 11, నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ – ఆగస్టు 12, ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ – ఆగస్టు 13, మే బ్రిలియంట్ కెరీర్ – ఆగస్టు 13, కాక్టెయిల్ 2 – ఆగస్టు 14, ఉమెత్తో – ఆగస్టు 14, మై బెస్ట్ ఫ్రెండ్ – ఆగస్టు 14 న స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది ట్రెయిటర్స్ సీజన్ 2 – ఆగస్టు 13 నుండి స్ట్రీమ్ కానుంది.
జీ5లో భారత భాగ్య విధాత, నిబ్బా నిబ్బీ – ఆగస్టు 14 నుండి స్ట్రీమ్ కానుండగా, జియో హాట్‌స్టార్‌లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 – ఆగస్టు 10, 108 బేస్ హాస్పిటల్ – ఆగస్టు 15నుండి స్ట్రీమ్ కానుంది. సన్ నెక్స్ట్ లో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ – ఆగస్టు 14 నుండి, ఆహాలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె – USA – ఆగస్టు 13 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక సోనీ లివ్లోకౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18 – ఆగస్టు 10 నుండి, మనోరమ మ్యాక్స్‌లో కాటాలన్ – ఆగస్టు 13 నుండి, లయన్స్‌గేట్ ప్లే లో ఆఖరి సవాల్ – ఆగస్టు 14 నుండి ఆపిల్ టీవీ+లో ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 – ఆగస్టు 12 నుండి స్ట్రీమ్ కానుంది.
వీకెండ్‌కు ఓటీటీల్లో భారీ కంటెంట్
ఈ లిస్టులో సినిమాలతో పాటు పలు క్రైమ్, థ్రిల్లర్, డ్రామా, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘భారత భాగ్య విధాత’, ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’, ‘కాక్టెయిల్ 2’ వంటి కంటెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు కంటెంట్ పరంగా పండగే. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కొత్త సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు చూడాలనుకునేవారికి ఈ వారం వచ్చిన కంటెంట్ మంచి వినోదాన్ని అందించనుంది.