Woman Shoots With Police Gun | పార్టీలో ఉండగా భార్య వీడియో కాల్.. పోలీస్ గన్‌తో కాల్చుకున్న ప్రియురాలు
Woman Shoots With Police Gun | ఒక పోలీస్ కానిస్టేబుల్ సహజీవనం చేస్తున్న ప్రియురాలితో కలిసి పార్టీ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడి భార్య వీడియో కాల్ చేయడంతో మాట్లాడాడు. కలత చెందిన ప్రియురాలు, కానిస్టేబుల్ గన్ తీసుకుని కాల్చుకుని మరణించింది.
న్యూఢిల్లీ: ఒక పోలీస్ కానిస్టేబుల్ సహజీవనం చేస్తున్న ప్రియురాలితో కలిసి పార్టీ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడి భార్య వీడియో కాల్ చేయడంతో మాట్లాడాడు. కలత చెందిన ప్రియురాలు, కానిస్టేబుల్ గన్ తీసుకుని కాల్చుకుని మరణించింది. (Woman Shoots With Police Gun) ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని కాలింది కుంజ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆశిష్ పవార్ పని చేస్తున్నాడు. వివాహితుడైన అతడు 25 ఏళ్ల ప్రియతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. గురువారం రాత్రి వారు నివసించే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అపార్ట్మెంట్లో పార్టీ జరుపుకున్నారు.
కాగా, పార్టీ మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ ఆశిష్ పవార్ భార్య వీడియో కాల్ చేసింది. దీంతో అతడు మాట్లాడాడు. సహజీవనం చేస్తున్న ప్రియ దీనిపట్ల కలత చెందింది. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆశిష్ పవార్ సర్వీస్ రివాల్వర్‌తో ప్రియ కాల్చుకున్నది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మరోవైపు ప్రియ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కాల్చుకున్న సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆశిష్ పవార్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
defence officials bribe | లంచం తీసుకున్న రక్షణ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీబీఐ
Karnataka family hang in Bihar | తీర్థయాత్రకు వెళ్లిన కుటుంబం.. సత్రం గదిలో నలుగురు ఆత్మహత్య
Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

