defence officials bribe | లంచం తీసుకున్న రక్షణ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సీబీఐ
defence officials bribe | రక్షణ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు రూ.2 లక్షలు లంచం తీసుకున్నారు. ట్రాప్ చేసిన సీబీఐ రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నది. డిఫెన్స్ ఆఫీసర్స్ ఇళ్లల్లో సోదాలు చేసింది. ఈ వ్యహారంలో ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నది.
ముంబై: రక్షణ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు రూ.2 లక్షలు లంచం తీసుకున్నారు. ట్రాప్ చేసిన సీబీఐ రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నది. (defence officials bribe) డిఫెన్స్ ఆఫీసర్స్ ఇళ్లల్లో సోదాలు చేసింది. ఈ వ్యహారంలో ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఖడ్కిలోని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్)కు సంబంధించిన కాంట్రాక్ట్ పనులను ఒక ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టర్ పూర్తి చేశాడు.
కాగా, ఎంఈఎస్కు చెందిన రక్షణ శాఖ అధికారులైన అసిస్టెంట్ గ్యారిసన్ ఇంజినీర్ సునీల్ నికం, జూనియర్ ఇంజినీర్ సురేష్ మష్కే బిల్లుల చెల్లింపు నిలిపివేసినట్లు ఆ కాంట్రాక్టర్ ఆరోపించాడు. డిఫెన్స్ అధికారులు రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఫిబ్రవరి 3న సీబీఐ కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 5న సీబీఐ అధికారులు ట్రాప్ వేశారు. జూనియర్ ఇంజినీర్ సురేష్ తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి తొలి విడతగా రూ.2 లక్షలు లంచం తీసుకోగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆ అధికారితో పాటు అసిస్టెంట్ గ్యారిసన్ ఇంజినీర్ సునీల్ నికంను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. కొన్ని పత్రాలతో పాటు రూ.1,88,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ పనుల బిల్లుల చెల్లింపు కోసం లంచం డిమాండ్ వ్యవహారంలో ఇతర అధికారుల ప్రమేయంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
Also Read:
Karnataka family hang in Bihar | తీర్థయాత్రకు వెళ్లిన కుటుంబం.. సత్రం గదిలో నలుగురు ఆత్మహత్య
Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

