Karnataka family hang in Bihar | తీర్థయాత్రకు వెళ్లిన కుటుంబం.. సత్రం గదిలో నలుగురు ఆత్మహత్య
Karnataka family hang in Bihar | ఒక కుటుంబం తీర్థయాత్రకు వెళ్లింది. ఒక సత్రంలో వారు బస చేశారు. అక్కడి గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాట్నా: ఒక కుటుంబం తీర్థయాత్రకు వెళ్లింది. ఒక సత్రంలో వారు బస చేశారు. అక్కడి గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Karnataka family hang in Bihar) బీహార్‌లోని నలంద జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం బౌద్ధులు, జైనులకు ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన రాజ్‌గిర్‌ను సందర్శించారు. అక్కడి ధర్మశాలలో రూమ్ బుక్ చేసుకుని బసచేశారు.
కాగా, వారు బస చేసిన సత్రంలోని గది తలుపు మూడు రోజులుగా తెరుచుకోలేదు. ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని ధర్మశాల మేనేజర్ గమనించాడు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సత్రం గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ముగ్గురు మహిళలతో సహా నలుగురు వ్యక్తుల మృతదేహాలు ఉరికి వేలాడం చూశారు.
మరోవైపు మృతులను 78 ఏళ్ల జీఆర్ సుమంగళ, ఆమె కుమార్తెలైన 48 ఏళ్ల శిల్ప, 43 ఏళ్ల శ్రుత, 50 ఏళ్ల కుమారుడు నాగ ప్రసాద్‌గా గుర్తించారు. నాగ ప్రసాద్ పేరుతో సత్రం రూమ్ బుక్ చేసినట్లు తెలుసుకున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా మృతులు కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి నివాసులుగా గ్రహించారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులను సంప్రదించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుల లగేజ్‌లో 25 స్ట్రిప్స్ నిద్రమాత్రలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు, ఇతర పత్రాలు, రూ. 1,18,000 నగదు, వ్యక్తిగత వస్తువులు వారి బ్యాగుల్లో ఉన్నాయి.
వీడియోగ్రఫీతో పాటు మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇద్దరు సభ్యుల బృందాన్ని కర్ణాటకలోని గుబ్బికి పంపినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Accidentally Hangs | రీల్ కోసం మహిళ ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మృతి
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

