తాండూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) కొత్త పథకాలు ప్రారంభించ కుండా ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగించలేని దుస్థితికి దిగజార్చిందని బీఆర్ఎస్ ( BRS ) నాయకులు ఆరోపించారు. సోమవారం తాండూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా ( Dharna ) నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోతుందని విమర్శించారు. కొత్త పింఛన్లు ప్రారంభించకుండా రేపుమాపు అంటూ దాటవేస్తోందని ఆరోపించారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలతో ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిల్లకు ఎంతో అండగా ఉండేవని తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, నాయకులు పూసాల ప్రణయ్ కుమార్, మంగపతి సురేష్ బాబు, గట్టు సంతోష్ కుమార్, ఎలుక రామచందర్, మాసాడి శ్రీరాములు, బోడ సతీష్, జాడి పోశం, అడ్వాల సత్యనారాయణ, బాబుఖాన్,ఇక్బాల్, చింటూ, దుగ్యాల ప్రదీప్ రావు, క్రాంతి కుమార్, శ్రీనివాస్, చోదన్,
కోల జ్యోతి, ఎరుకల రాజమణి, గుండేటి లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.