Deer Vs Tiger | ప్రకృతిలో వన్యప్రాణులు మనుగడ సాధించాలంటే తమ శుత్రువుల కదలికలను గమనించుకుంటూ జీవన పోరాటం సాగించాల్సిందే. ప్రత్యేకించి వన్యమృగాలు తమ ఆకలి తీర్చుకునేందుకు మాటు వేసి ఇతర జీవులను చంపుతుంటాయి. ఈ క్రమంలో వన్యమృగాలకు బలికాకుండా ఇతర జంతువులు అప్రమత్తంగా ఉంటాయి.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
పులి తన చాకచక్యంతో జింకను చంపి తినాలనుకుంది. అయితే ప్రాణాలు దక్కాలని రాసి పెట్టి ఉంటే ఏ రూపంలోనైనా మృత్యువు నుంచి తప్పించుకునే మార్గం దొరుకుతుంది. ఈ జింకకు కూడా అలానే రాసి పెట్టిఉన్నట్టుంది..ఆ జింకకు ఇంకా భూమి మీద నూకలు బాకి ఉన్నాయి. అనుకోని అతిథి ఆ జింక ప్రాణాలు కాపాడింది. ఇంతకీ ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా..? నెమలి. జింక నీళ్లు తాగేందుకు ఓ కొలను దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో జింకను చూసిన పులి సైలెంట్‌గా చెట్టు చాటున మాటువేసి జింకను అదిమిపట్టేందుకు వేచి చూస్తోంది.
న్ని క్షణాల్లోనే జింకపై దాడి చేయాలనుకునేలోపే నెమలి అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విన్న జింక వెనుకాల ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి చెంగుచెంగున పరుగులు పెట్టింది. ఇంతలోనే పులి కూడా దాన్ని వెంబడించి పట్టుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జింక తుర్రున పోదొల్లోకి వెళ్లిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది. నెమలి జింక ప్రాణాలు కాపాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Incredible India 🇮🇳!
That peacock warning call just saved the deer’s life.
Better luck next time, tiger. 🦌🐅 https://t.co/AmSduiTg6N
— Erik Solheim (@ErikSolheim) October 3, 2026