Talasani Srinivas Yadav | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పత్రి సనత్‌నగర్ టిమ్స్. కేసీఆర్ హయాంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో రూపుదిద్దుకొన్న నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్‌నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
గతంలో టిమ్స్ ముందు చేపట్టిన ఓ కార్యక్రమంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దిగిన ఫొటోను ఈ సందర్భంగా తలసాని షేర్ చేసుకున్నారు. సనత్‌నగర్ TIMS ప్రారంభం తెలంగాణ ప్రజారోగ్య రంగంలో మరో మైలురాయి. కేసీఆర్ విజన్‌లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తి చేసిన ఈ ఆసుపత్రి నేడు ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని తలసాని ట్వీట్ చేశారు.
సనత్‌నగర్ TIMS ప్రారంభం తెలంగాణ ప్రజారోగ్య రంగంలో మరో మైలురాయి. కేసీఆర్ గారి విజన్‌లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తి చేసిన ఈ ఆసుపత్రి నేడు ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. సనత్‌నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.#TIMS #KCR #BRS
File Pic pic.twitter.com/pJmJlfJ5My
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 17, 2026