Bhagyashri Borse | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆపరేషన్ గంగా’ సినిమాతో ఆమె మాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన భాగ్యశ్రీ.. ఆయనతో కలిసి పనిచేస్తున్న అనుభవాన్ని వివరిస్తూ రాసిన మాటలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోహన్‌లాల్‌తో కలిసి నటించడం తనకు ఆశీర్వాదంగా భావిస్తున్నానని భాగ్యశ్రీ పేర్కొన్నారు. షూటింగ్లో ప్రతి రోజూ ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని, ఆయన చూపు ద్వారా సినిమాను మరో కోణంలో చూడగలుగుతున్నానని తెలిపారు.
మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న భాగ్యశ్రీ.. ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. మోహన్‌లాల్‌కు సహనటిగా ఉండటం తనకు ఒక ఆశీర్వాదంలా అనిపిస్తోందని తెలిపారు.ప్రతి రోజు షూటింగ్లో ఆయనను చూస్తూ సినిమాను ఎలా చూడాలో నేర్చుకుంటున్నానని, ఆయనలో ఉన్న ప్రతిభ నిజంగా అద్భుతమని ప్రశంసించారు. ఒక సీనియర్ నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని ఆమె పేర్కొన్నారు. భాగ్యశ్రీ చేసిన ఈ పోస్టు మోహన్‌లాల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కొత్త నటి తన సహనటుడైన మోహన్‌లాల్ గురించి ఇంత ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడటంపై అభిమానులు స్పందిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే ‘ఆపరేషన్ గంగా’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే సినిమాలు చేసిన భాగ్యశ్రీకి ఈ చిత్రం మరో ముఖ్యమైన అవకాశం అని చెప్పొచ్చు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆపరేషన్ గంగా’ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో మోహన్‌లాల్, భాగ్యశ్రీ బోర్సేతో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమా 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపు కార్యక్రమం నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఆ సమయంలో వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి చేపట్టిన భారీ తరలింపు చర్యలే ఈ సినిమాకు ప్రధాన నేపథ్యంగా నిలవనున్నాయి.