నగోయా: బాక్సర్ లవ్లీనా బోర్గహెయిన్(Lovlina Borgohain) చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. మహిళల 75 కేజీల విభాగం ఫైనల్ బౌట్లో ఆమె చైనా ప్రత్యర్థి బావో జియిపై 5-0 తేడాతో విజయం నమోదు చేసింది. ఇవాళ బాక్సర్ లవ్లీనా పుట్టిన రోజు. అయితే బర్త్‌డే రోజునే ఆమె గోల్డ్ మెడల్ కొట్టడం గమనార్హం. ఒలింపిక్ పతక విజేత లవ్లీనా.. ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సృష్టించింది.గతంలో లెజెండరీ బాక్సర్ కేసీ మేరీకోమ్ స్వర్ణం గెలుచుకున్నది. 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్ 51 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో ఆమె ఆ పతకాన్ని సాధించింది.
HISTORIC GOLD FOR BHARAT! 🇮🇳🥇
Heartiest congratulations to Lovlina Borgohain on winning the first ever Gold Medal in the Women’s 75kg weight category boxing event at the Asian Games 2026.
The entire nation is proud of you!#Cheer4Bharat pic.twitter.com/nw3YyeWDX8
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2026
ఏషియన్ గేమ్స్‌లో 13వ రోజు భారత్‌కు పతకాల జోరు మొదలైంది. లవ్లీనా గోల్డ్ సాధించడంతో.. ఈ గేమ్స్‌లో భారత్ గెలిచిన స్వర్ణ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇవాళ మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు గోల్డ్ కొట్టింది. ఇక రికర్వ్ మిక్స్డ్ టీమ్‌లో భారత జట్టుకు సిల్వర్ మెడల్ వచ్చింది. ప్రస్తుతానికి 70 పతకాలు గెలిచిన భారత్ .. మెడల్స్ ట్యాలీలో ఆరో స్థానంలో నిలిచింది. భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 24 రజతం, 35 కాంస్య పతకాలను గెలుచుకున్నది.