ఊట్కూరు : రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోలేని అమసర్ధతతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. సాగు, తాగు నీటికి కూడా ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ అలసత్వంపై అన్ని వర్గాల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
తాజాగా నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఊట్కూరు మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన హెచ్ నరసింహ అనే సామాజిక కార్యకర్త బిజ్వారం, పులిమామిడి గ్రామ శివారు లోని వ్యవసాయ పొలంలో కొద్ది గంటలపాటు దీక్ష చేపడుతానని ప్రకటించారు. అలాగే పత్తికి క్వింటా ళుకు రూ.10 వేలు మద్ధతు ధర చెల్లించాలన్నారు. వర్షాభావతో అన్ని పంటలు నష్టపోయినందున ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.