Man Leaving For Honeymoon Arrested | కొత్తగా పెళ్లైన వ్యక్తి.. హనీమూన్‌కు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్
Man Leaving For Honeymoon Arrested | కొత్తగా పెళ్లైన వ్యక్తి నవ వధువుతో కలిసి హనిమూన్‌కు బయలుదేరాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాడి, విధ్వంసానికి సంబంధించిన కేసులో అతడ్ని అరెస్ట్ చేశారు.
లక్నో: కొత్తగా పెళ్లైన వ్యక్తి నవ వధువుతో కలిసి హనిమూన్‌కు బయలుదేరాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాడి, విధ్వంసానికి సంబంధించిన కేసులో అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Leaving For Honeymoon Arrested) ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా తిలహర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అక్షయ్ కదమ్, డిసెంబర్ 19న బీజేపీ నేత దివాకర్ సింగ్‌కు చెందిన హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు. తన అనుచరులతో కలిసి అక్కడ విధ్వంసం సృష్టించాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులపై కూడా అక్షయ్ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో అతడితో సహా ఐదుగురిపై పలుసెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే అక్షయ్‌తో సహా మరో ఇద్దరు పారిపోయారు. అతడి సమాచారం కోసం రూ.25,000 రివార్డును పోలీసులు ప్రకటించారు.
మరోవైపు అక్షయ్ మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిలహర్ పోలీస్ బృందం అక్కడకు వెళ్లింది. ఫిబ్రవరి 5న ఒక ఫంక్షన్ హాల్లో అక్షయ్ పెళ్లి జరిగింది. ఈ వివాహం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర చేరుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. అయితే పోలీసుల కళ్లగప్పి అతడు తప్పించుకున్నాడు.
కాగా, పెళ్లి తర్వాత అక్షయ్ నవ వధువుతో కలిసి హనిమూన్‌కు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అతడ్ని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ కింద ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాకు అక్షయ్‌ను తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
private aircraft crashes | కూలిన ప్రైవేట్ విమానం.. కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- honeymoon
- Maharashtra
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

