Fauzi | ‘ఫౌజీ’పై మైత్రీ నిర్మాత బిగ్ అప్డేట్.. డిసెంబర్ 2 నుంచే ప్రభాస్ హంగామా ప్రారంభం!
Fauzi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన కీలక అప్డేట్తో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
Fauzi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన కీలక అప్డేట్తో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇటీవల విడుదలైన ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్, పాత్ర తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ సినిమా పురోగతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫౌజీ’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోందని, అన్ని పనులు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.అంతేకాకుండా అభిమానులకు మరో శుభవార్త కూడా చెప్పారు. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని, అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నట్లు నిర్మాత వెల్లడించారు. దీంతో అధికారిక విడుదల తేదీకి ముందే ప్రేక్షకులు ‘ఫౌజీ’ని చూసే అవకాశం దక్కనుంది. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
హను రాఘవపూడి తనదైన భావోద్వేగ కథనంతో పాటు అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించడంలో పేరుగాంచారు. ఇప్పుడు ప్రభాస్‌తో ఆయన రూపొందిస్తున్న ‘ఫౌజీ’ కూడా అదే స్థాయిలో ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను తీసుకురాగా, త్వరలో టీజర్, పాటలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

