BJP MLA Devyani Rana | జమ్ముకశ్మీర్ బడ్జెట్‌ను విమర్శించిన బీజేపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన ఒమర్ అబ్దుల్లా ఎమ్మెల్యేలు, ఎందుకంటే?
BJP MLA Devyani Rana | జమ్ముకశ్మీర్ బడ్జెట్‌ను కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దేవయాని రాణా తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించిన ఆమె బడ్జెట్లోని లోటుపాట్లను ఎత్తిచూపారు. సీఎం ఒమర్ అబ్దుల్లాకు చెందిన అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల సభ్యులు ఆమెను ప్రశంసించారు.
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ బడ్జెట్‌ను కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దేవయాని రాణా (BJP MLA Devyani Rana) తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించిన ఆమె బడ్జెట్లోని లోటుపాట్లను ఎత్తిచూపారు. సీఎం ఒమర్ అబ్దుల్లాకు చెందిన అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల సభ్యులు ఆమెను ప్రశంసించారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రూ. 1.13 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కాగా, గతంలో ఎన్సీ సీనియర్ నేత అయిన దేవేందర్ సింగ్ రాణా, సీఎం ఒమర్ అబ్దుల్లాకు
అత్యంత సన్నిహితుడు. 2024 అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీకి ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగ్రోటా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా దేవేందర్ సింగ్ రాణా గెలిచారు. అయితే కొన్ని నెలలకే ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె దేవయాని రాణా బీజేపీ తరుఫున పోటీ చేసింది. ఎన్సీ పెద్దగా పోటీ ఇవ్వకపోవడంతో ఆమె గెలిచింది.
మరోవైపు శనివారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. దీంతో అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దేవయాని రాణా తొలిసారి మాట్లాడారు. ఆమె తొలి ప్రసంగాన్ని ప్రోత్సహించాలని స్పీకర్ అబ్దుల్ రహీమ్ రథర్ సభ్యులను కోరారు. ఈ నేపథ్యంలో దేవయాని రాణా సుమారు 12 నిమిషాల ప్రసంగాన్ని సభ నిశ్శబ్దంగా ఆలకించింది.
కాగా, కీలక రంగాల్లో బడ్జెట్ కేటాయింపులను ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం తగ్గించడంపై దేవయాని తీవ్రంగా విమర్శించారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యల కోసం కేటాయింపులను సగానికిపైగా తగ్గించడాన్ని తప్పుపట్టారు. విద్యా బడ్జెట్‌ను తగ్గిస్తే స్కూల్స్ మూసివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ఒక పేద బిడ్డ ఎలా అభివృద్ధి చెందుతాడని ఆమె ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వ విధానపర లోపాలను ఎత్తిచూపారు.
అయితే బీజేపీ యువ ఎమ్మెల్యే దేవయాని రాణా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ అధికార ఎన్సీతో సహా ఇతర పార్టీల సభ్యులంతా ఆమెను ప్రశంసించారు. బల్లలు చరిచి దేవయాని తొలి ప్రసంగాన్ని అభినందించారు.
My maiden speech in the J&K Legislative Assembly as MLA Nagrota speaking on the J&K Budget 2026-27 on 7th February 2026@bjp4india @bjp4jnk @bjym4jk #JammuAndKashmir pic.twitter.com/2Ndo7NJAtg
— Devyani Rana (@devyanidsrana) February 7, 2026
Also Read:
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు
Watch: చెత్త పడేసేందుకు పోర్టర్‌ను బుక్ చేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

