తల్లి కాలు విరిగిందని మనస్తాపం.. ఉరివేసుకుని కుమారుడి బలవన్మరణం
తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్‌పురా కాలనీలో నివాసం ఉండే మహ్మద్ ఇర్ఫాన్ సిద్దికి-అమీనా ఇర్ఫానా దంపతులు. వారికి అబ్దుల్ సలాం సిద్దికి, అబ్దుల్ సమద్ సిద్దికి (16) అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి అమీనా ఇర్ఫానాకు రెండు రోజుల క్రితం చిన్న ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో చిన్న కుమారుడు సమద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో శనివారం అందరూ ఆస్పత్రికి వెళ్లగా.. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న సమద్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు సలాం ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న సమద్ కనిపించాడు. దీంతో కంగారుపడిపోయి అతను.. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అనంతరం సమద్‌ను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
కాగా, తల్లి కాలు విరగడంతో బాధపడిన చిన్న కొడుకు మానసిక వేధనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఇర్ఫాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

