Ramayana | రామాయణ నుంచి సీతారాముల ఫస్ట్ లుక్ విడుదల.. రణ్‌బీర్, సాయి పల్లవి పోస్టర్‌తో భారీ అంచనాలు!
Ramayana | భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం మరోసారి వెండితెరపై సరికొత్త రూపంలో ఆవిష్కృతమవుతోంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రామాయణం’ అనే పేరునే ఖరారు చేశారు.
Ramayana | భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం మరోసారి వెండితెరపై సరికొత్త రూపంలో ఆవిష్కృతమవుతోంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రామాయణం’ అనే పేరునే ఖరారు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండగా.. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన తొలి పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘రామాయణం’ చిత్రబృందం ప్రేక్షకులకు ప్రత్యేక కానుక అందించింది. ఈ సందర్భంగా సీతారాములుగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఉన్న తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.
పోస్టర్లో సీత, రాములు ఏకాంతంగా ఉన్న ఓ అందమైన సందర్భాన్ని చూపించారు. ఈ పోస్టర్‌కు సంబంధించిన సుమారు 30 సెకన్ల వీడియోను కూడా విడుదల చేయగా.. ఇందులో సినిమా తెరకెక్కిస్తున్న భారీ ప్రపంచానికి కేవలం ఓ చిన్న పరిచయం మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయి వివరాలను వెల్లడించకుండా ఆసక్తిని పెంచేలా ఈ వీడియోను రూపొందించారు. రాబోయే రోజుల్లో సినిమా నుంచి వరుసగా కీలకమైన ప్రచార కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన తొలి పాటపై కూడా ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘జై జై రామ్’ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రామాయణం వంటి ఇతిహాస కథకు రెహమాన్ సంగీతం అందించడం, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కూడా ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, రవి దూబే, వివేక్ ఒబెరాయ్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కేవలం సాధారణ పౌరాణిక కథగా కాకుండా.. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రంగా ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్లో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన హాన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం విశేషంగా మారింది. ‘రామాయణం’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, తొలి భాగాన్ని 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

