Toxic Fumes | భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు ఇంట్లో మృతి.. విష వాయువులు కారణమని అనుమానం
Toxic Fumes | భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు వారి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. తొలుత వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానించారు. అయితే ఆ ఇంట్లో విష వాయువులు వెలువడంతో ఆ ముగ్గురు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అహ్మదాబాద్: భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు వారి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. తొలుత వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానించారు. అయితే ఆ ఇంట్లో విష వాయువులు వెలువడంతో ఆ ముగ్గురు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. (Toxic Fumes) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల ఫైజ్ అహ్మద్, 36 ఏళ్ల భార్య ముబినా, 12 ఏళ్ల కుమారుడు నోమ్నాతో కలిసి లాల్గేట్లోని హరిపుర ప్రాంతంలో నివసిస్తున్నారు. వారం క్రితం సౌదీ అరేబియాలో ఉమ్రా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు.
కాగా, మంగళవారం ఉదయం ఫైజ్ అహ్మద్, అతడి భార్య, కుమారుడు వారింట్లోని హాల్లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత అనుమానం వ్యక్తమైంది. అయితే తొలుత ఆ ఇంట్లోకి వెళ్లిన వారు గ్యాస్ దుర్వాసన వల్ల ఊపిరాడక ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. మృతుల నోటి దగ్గర నురుగు కనిపించిందని, విషపూరిత పొగలు పీల్చడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు.
మరోవైపు మృతదేహాలు ఉన్న హాలులో ఏసీ, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఒక దాని నుంచి విడుదలైన విష వాయువు కారణంగా ఆ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా తెలుస్తున్నదని చెప్పారు. దీంతో గ్యాస్ లీకేజీ కోసం అన్ని గృహోపకరణాలను ఒక బృందం తనిఖీ చేస్తున్నదని వివరించారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
BJP Leader Assaults Woman | మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

