భోపాల్: బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. (BJP Leader Assaults Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిహావల్‌కు చెందిన బీజేపీ నేత సంతోష్ పాఠక్ ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఆమెను కర్రతో కొట్టాడు. కాళ్లతో తన్నాడు. వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. అయితే ఆ మహిళను ఎందుకు అలా కొట్టాడో అన్నది తెలియలేదు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ ‘బేటీ పడావో, బేటీ బచావో’ గురించి మాట్లాడారు, కానీ బీజేపీ నాయకుల నుంచి కూడా కూతుళ్లను రక్షించుకోవాలని చెప్పడం మర్చిపోయారు. ఈ రోజు సిద్ధిలో ఒక బీజేపీ నాయకుడు మహిళను కర్రతో దారుణంగా కొట్టాడు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను కూడా జీతూ పట్వారీ విమర్శించారు. మహిళల భద్రతను నిర్ధారించడం ఆయన బాధ్యత అని, అయితే ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళను కొట్టిన బీజేపీ నేతపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:
प्रधानमंत्री @narendramodi ने कहा था बेटी पढ़ाओ बेटी बचाओ, लेकिन वह कहना भूल गए कि भाजपा नेताओं से ही बेटियों को बचाओ।
आज सीधी में एक बहन के साथ भाजपा नेता द्वारा लाठी से बेरहमी से मारपीट की गई।
पूरे प्रदेश में भाजपा नेताओं द्वारा बहनों के साथ मारपीट की घटनाएं बढ़ रही हैं।… pic.twitter.com/3nvhh6byLW
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) February 8, 2026
Also Read:
girl raped and killed | ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లి.. అత్యాచారం చేసి హత్య
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి