Avika Gor | ఆసుపత్రి పాలైన అవికా గోర్.. 104 డిగ్రీల జ్వరంలోనూ షూటింగ్ చేసిన ‘చిన్నారి పెళ్లికూతురు’
AvikaGor | టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన 'బాలికా వధు' (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
Avika Gor | టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవికా గోర్ భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. గత ఐదు రోజులుగా ఆమె ఏకంగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో తన వృత్తిపై ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. నిర్మాతలకు నష్టం జరగకూడదనే ఆలోచనతో ఆమె తీవ్ర అనారోగ్యంలోనూ షూటింగ్లలో పాల్గొనడమే కాకుండా, ఒక యాడ్ షూట్ కోసం ఢిల్లీకి కూడా ప్రయాణించారు. అయితే నీరసం మరియు జ్వరం మరింత పెరగడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమె నటించిన సరికొత్త హిందీ మ్యూజిక్ ఆల్బమ్ ‘బుఖార్’ (జ్వరం) విడుదలైన రోజే ఆమె నిజంగానే జ్వరంతో ఆసుపత్రిపాలవడం గమనార్హం. ఆసుపత్రి మంచంపై నుంచే తన పాట విడుదలైన విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఆమె, తన ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతోందని, డెంగ్యూ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని పేర్కొంటూ విక్టరీ సింబల్ చూపించారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

