పాట్నా: బయట ఆడుకుంటున్న బాలికను ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. రక్తం మడుగులో ఉన్న బాలిక మృతదేహాన్ని చెరువు వద్ద గుర్తించారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. (girl raped and killed) బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం ఆరేళ్ల బాలిక మరో ఇద్దరు బాలికలతో కలిసి బయట ఆడుకుంటున్నది.
కాగా, ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. ఆ బాలికలను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు బాలికలు తప్పించుకుని పారిపోయారు. చేతికి చిక్కిన ఒక బాలికను సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత చంపేశాడు.
మరోవైపు బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాత్రి వేళ అన్నిచోట్ల వెతికారు. చెరువు వద్ద కుక్కలు మొరగడంతో అక్కడకు వెళ్లారు. రక్తం మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కలిసి ఆడుకున్న ఇద్దరు బాలికలకు ఆ ఫుటేజ్ చూపించారు. వికాస్ మహతోను నిందితుడిగా వారు గుర్తించడంతో అరెస్ట్ చేశారు.
అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆదివారం బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రధాన రహదారిని దిగ్బంధించి నిరసన చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. బాధిత కుటుంబం, నిరసనకారులతో పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
#WATCH | Darbhanga, Bihar | On the rape and murder of a minor, Darbhanga SSP Jagunath Reddy says, “As soon as we received information regarding the incident, the administration reached the spot…The accused have been detained and upon interrogation, they confessed to the crime.… pic.twitter.com/K3XDzngj3a
— ANI (@ANI) February 8, 2026
A shocking crime in #Bihar’s #Darbhanga has left residents angry and deeply disturbed after a 6-year-old girl was found raped and murdered near a pond.
The incident came to light late on Saturday night after the child went missing earlier in the evening.
Police have arrested a… pic.twitter.com/yjmesbJvn3
— Hate Detector 🔍 (@HateDetectors) February 8, 2026
Also Read:
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
private aircraft crashes | కూలిన ప్రైవేట్ విమానం.. కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు
Watch: మేళాలో కూలిన స్వింగ్ రైడ్.. పోలీస్ అధికారి మృతి, 13 మందికి గాయాలు