ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా.. ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ
ఆటో కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిని గుర్తించి, సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులందరికీ తన సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయించారు.
ఆటో కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిని గుర్తించి, సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులందరికీ తన సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయించారు.
బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు బొమ్మనవేని రాజు సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఆటో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం నెలకొంది.కానీ రామన్న ముందుగానే చేయించిన ప్రమాద బీమా కారణంగా ఈరోజు రాజు కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందింది. రాజు కుటుంబం రోడ్డున పడకుండా రామన్న ముందుచూపు అండగా నిలిచింది.
ఈ సందర్భంగా ఆటో కార్మికులు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయించి, ప్రమాదం జరిగిన కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్ మానవత్వాన్ని వారు కొనియాడారు.
♦️ ఆటో కార్మికుల కుటుంబాలకు రామన్న భరోసా!
♦️ ఆపద రాకముందే బీమా కవచం.. ప్రమాదం తర్వాత రూ.5 లక్షల అండ
రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిని గుర్తించి,
సిరిసిల్ల జిల్లాలోని ఆటో… pic.twitter.com/w5NLPAquOY— BRS Party (@BRSparty) August 8, 2026
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి-శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచులు కొండ రమేష్, అందె సుభాష్, ఎలగందుల నరసింహులు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Auto Drivers
- Insurance
- KTR
- Sircilla
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

