Khammam | ఆ తండ్రికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ గోరు ముద్దులు తినిపించిన చేతులతోనే కన్న బిడ్డలకు విషమిచ్చి(pesticide) ఆపై తాను మృతి(Father commits suicide) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా(NTR Dist) గండ్రాయిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురంగ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు (38) అనే రైతు సొంతూరిలో తనకున్న పది ఎకరాలతో పాటు, పెదమండవ గ్రామంలో పది ఎకరాలు, జిల్లా సరిహద్దులోని ఏపీలో గల ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రీనివాసరావు తన కూతురు లాస్య(14), కొడుకు నిఖిల్‌ను(11) బైక్‌పై తీసుకుని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు చేరుకున్నాడు.
కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాను తాగి ఆపై పిల్లలకూ తాగించాడు. పొలం వద్ద కొట్టుమిట్టాడుతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. మార్గమధ్యలో శ్రీనివాసరావు మృతిచెందగా, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కూతురు లాస్య మృతిచెందింది. కొడుకు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులు లేని శ్రీనివాసరావు ఈ దారుణానికి ఎందుకు పాల్పడి ఉంటాడనిగ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.