Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసు.. బాబా అరెస్ట్
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. మృతులది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు. విషం కలిపిన లడ్డూలు ఇచ్చి వారిని హత్య చేసిన బాబాను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: కారులో మూడు మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. మృతులది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు. విషం కలిపిన లడ్డూలు ఇచ్చి వారిని హత్య చేసిన బాబాను అరెస్ట్ చేశారు. (Delhi triple murder case) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 8న పీరాగఢి ఫ్లైఓవర్‌పై పార్క్ చేసిన కారులో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తొలుత ఆత్మహత్యగా అనుమానించారు.
కాగా, మృతులను ఢిల్లీలోని నంగ్లీ డెయిరీ ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల రణధీర్, బాప్రోలా ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల శివ నరేష్, జహంగీర్‌పురికి చెందిన 40 ఏళ్ల లక్ష్మీగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే అవకాశాన్ని ముగ్గురి కుటుంబాలు తోసిపుచ్చాయి. దీంతో ఈ కేసుపై దర్యాప్తు చేయగా అసలు మిస్టరీ వీడింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన బాబా కమ్రుద్దీన్, ఘజియాబాద్ సమీపంలోని లోని ప్రాంతంలో తాంత్రిక కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ‘ధన్వర్ష్’ పూజల ద్వారా రెండు, మూడు రెట్ల డబ్బు లభిస్తుందని నమ్మిస్తూ కొందరు వ్యక్తులను ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట బాబా కమ్రుద్దీన్‌ను లక్ష్మీ కలిసింది. ఆ తర్వాత శివ నరేష్, రణధీర్‌ను బాబాకు ఆమె పరిచయం చేసింది.
ఫిబ్రవరి 7న ఆ ముగ్గురూ లోని ప్రాంతానికి వెళ్లి బాబా కమ్రుద్దీన్‌ను కలిశారు. ‘ధన్వర్ష్’ పూజతో డబ్బును రెండుమూడింతలు చేస్తానని అతడు నమ్మించాడు. రూ.2 లక్షల డబ్బు, మద్యం, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని చెప్పాడు. దీంతో ఫిబ్రవరి 8న ఆ ముగ్గురు మరోసారి కారులో బాబా వద్దకు వెళ్లారు.
అయితే ‘ధన్వర్ష్’ పూజ తర్వాత వారితో కలిసి కారులో బాబా కమ్రుద్దీన్ ప్రయాణించాడు. విషం కలిపిన లడ్డూలు, మూడు మద్యం బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ వారికి ఇచ్చాడు. ఆ లడ్డూలు తిని, డ్రింక్స్ సేవించిన తర్వాత ఆ ముగ్గురు స్పృహ కోల్పోయారు. కమ్రుద్దీన్ వారి వద్ద ఉన్న రూ.2 లక్షలు తీసుకుని కారు దిగి పారిపోయాడు. మృతుల కుటుంబాల సమాచారం, సాంకేతిక ఆధారాలతో బాబాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
#WATCH | Delhi: As per Sachin Sharma, Additional DCP, Kamruddin alias ‘Baba’ has been arrested by Delhi Police in connection with the bodies of three people found in a car on Peeragarhi flyover.
(Source: Delhi Police) https://t.co/Sx9OgHL5nD pic.twitter.com/3OpHBRkRiS
— ANI (@ANI) February 11, 2026
Also Read:
Toxic Fumes | భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు ఇంట్లో మృతి.. విష వాయువులు కారణమని అనుమానం
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

